చంద్రబాబు ఇకజన్మలో సీఎం కాలేవ్, మూటాముళ్లు సర్దుకో: వైసీపీ నేత కిల్లి

By Nagaraju penumalaFirst Published Feb 23, 2019, 1:36 PM IST
Highlights

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, విపక్షాలను సీఎం చంద్రబాబు కలవడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. 
 
శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి నిప్పులు చెరిగారు. ఇకపై జన్మలో చంద్రబాబు సీఎం కాలేరని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆమె ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిస్తే తప్పేంటని నిలదీశారు. 

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, విపక్షాలను సీఎం చంద్రబాబు కలవడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. 

ప్రత్యేక హోదా విషయంలో రాహుల్‌‌గాంధీ మాటలను విశ్వసిస్తున్నామన్న చంద్రబాబు ఎందుకు యూపీఏలో చేరడం లేదని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 

వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తాను పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈనెల 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న అంశంపై క్లారిటీ రావడం లేదు. 

శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది సస్పెన్షన్. మరి వైఎస్ జగన్ ఆమెను అసెంబ్లీకి పంపాలనకుంటున్నారా లేక పార్లమెంట్ కు పంపాలనుకుంటున్నారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.  
 
click me!