
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 110 పోస్టులకు సంబంధించి తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు. అయితే స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్టు నియామకాన్ని తర్వాత ప్రకటిస్తామని గౌతం సవాంగ్ చెప్పారు. ఎక్కువగా మహిళ అభ్యర్థులే గ్రూప్-1కు ఎంపికయ్యారని తెలిపారు. ఇక, గతేడాది సెప్టెంబర్ 30న 111 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. కేవలం 19 రోజులలోనే అంటే జనవరి 27న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు.
గ్రూప్ -1 ప్రిలిమ్స్‌కు 86 వేల మంది హాజరు కాగా.. 6,455 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్ పరీక్ష నిర్వహించారు. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తాజాగా ఈరోజు ఫలితాలను ప్రకటించారు. గ్రూప్-1 తుది ఫలితాల్లో తొలి మూడు ర్యాంకులు మహిళా అభ్యర్థులే సొంతం చేసుకున్నారు.
గ్రూప్-1 తొలి ర్యాంకు- భానుశ్రీ భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష
సెకండ్ ర్యాంక్- భూమిరెడ్డి భవాని
మూడో ర్యాంకు- లక్ష్మీ ప్రసన్న,
నాలుగో ర్యాంకు- ప్రవీణ్ కుమార్ రెడ్డి
ఐదో ర్యాంకు- భానుప్రకాష్ రెడ్డి