నన్ను విమర్శించే వాళ్లు.. గతంలో ఏం చేశారు: చంద్రబాబు

By sivanagaprasad kodatiFirst Published Jan 9, 2019, 2:10 PM IST
Highlights

ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమరావతి నుంచి గ్రామానికి హెలికాఫ్టర్‌లో చేరుకున్న ఆయన ఎడ్లబండిపై సభా ప్రాంగణానికి వచ్చారు

ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమరావతి నుంచి గ్రామానికి హెలికాఫ్టర్‌లో చేరుకున్న ఆయన ఎడ్లబండిపై సభా ప్రాంగణానికి వచ్చారు.

అక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టుతో అనేక ప్రయోజనాలు కలుగుతుయని వెల్లడించారు. సరుకు రవాణాతో పాటు మత్య్సకారులకు ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు తెలిపారు.

త్వరలో కాగితం తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేస్తామని, తనను విమర్శించిన వారు గతంలో ఏం చేశారని సీఎం ప్రశ్నించారు. రామాయపట్నం మైనర్ పోర్టు కాదని, ఇది రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పోర్టని.. దీని వల్ల పరిసర ప్రాంతాల వారికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు.  

click me!