ఉద్దానంపై పవన్ ది దొంగ ప్రేమ:చంద్రబాబు

Published : Oct 18, 2018, 01:29 PM IST
ఉద్దానంపై పవన్ ది దొంగ ప్రేమ:చంద్రబాబు

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. ఉద్దానంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ది దొంగ ప్రేమని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు తుఫాన్ తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పవన్‌ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. 

శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. ఉద్దానంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ది దొంగ ప్రేమని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు తుఫాన్ తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పవన్‌ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. తిత్లీ బాధితులు ఇబ్బందులు పడుతుంటే పవన్‌ కవాతును కేటీఆర్‌ అభినందించడమేంటని చంద్రబాబు నిలదీశారు. తనపై మోదీ, కేసీఆర్‌, జగన్‌, పవన్‌ కక్షగట్టారని తానేం తప్పు చేశానని కక్షగట్టారో చెప్పాలన్నారు.  


విభజన హామీలు అమలు చేస్తారనే ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న చంద్రబాబు విభజన హామీలు అమలు చేయకపోగా,తెలుగుజాతిని చిన్నచూపు చూశారని  ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ, పవన్ పార్టీలను బీజేపీ రాష్ట్రంపై ఉసిగొల్పుతోందని బాబు విమర్శించారు. తెలుగుజాతిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 

ఉద్దానానికి ఇంత కష్టమొస్తే జగన్‌ ఎక్కడికి పోయారని చంద్రబాబు ప్రశ్నించారు. పక్క జిల్లాలో ఉన్న జగన్‌ తిత్లీ బాధితులను పరామర్శించరా? అని నిలదీశారు. బీజేపీతో కలిసి వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సహాయకచర్యలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే