ఫలితాల ఎఫెక్ట్: సర్వేలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

By narsimha lodeFirst Published Jul 3, 2019, 4:53 PM IST
Highlights

ఎన్నికల తర్వాత పార్టీ నేతల నుండి వచ్చిన  సూచనల మేరకు చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకొన్నారు. పార్టీ బ్యాక్ ఆఫీస్ నుండి ఇక నుండి సర్వేలు తెప్పించనని హామీ ఇచ్చారు.

అమరావతి: ఎన్నికల తర్వాత పార్టీ నేతల నుండి వచ్చిన  సూచనల మేరకు చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకొన్నారు. పార్టీ బ్యాక్ ఆఫీస్ నుండి ఇక నుండి సర్వేలు తెప్పించనని హామీ ఇచ్చారు.

ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో  ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారానికి దూరం కావడానికి ఆ పార్టీ నేతలు కారణాలను అన్వేషిస్తున్నారు.

 అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వచ్చిన నివేదికలు తమ కొంపలు ముంచాయని కొందరు మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నెల 1వ తేదీన చంద్రబాబుతో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు  సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పలు అంశాలను నేతలు  బాబు దృష్టికి తెచ్చారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న సమయంలో  అసంతృప్తి, వ్యతిరేకత పేరుతో వచ్చిన నివేదికలు బహిర్గతం చేయడం వల్ల ఇబ్బందికి గురైన విషయాన్ని నేతలు బాబుకు చెప్పారు.

జనసేన వల్ల కూడ టీడీపీకి తీవ్రంగా నష్టం జరిగిందని  నేతలు కొందరు బాబు దృష్టికి తెచ్చారు. వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం కూడ దెబ్బతీసిందనే అభిప్రాయాన్ని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని  చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. 

click me!