ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేందుకు మూడు రాజధానులు: జగన్ పై చంద్రబాబు ఫైర్

By narsimha lode  |  First Published Oct 14, 2022, 1:28 PM IST

తప్పు చేసిన వారు ఎవరైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు.   రాస్ట్రంలో పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని జగన్ సర్కార్  తప్పుడు కేసులు బనాయిస్తుందన్నారు.
 


అమరావతి:మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని  టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు.శుక్రవారం నాడు అమరావతిలో టీడీపీ లీగల్ సెల్  సమావేశంలో  చంద్రబాబు ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతికి అనుకూలంగా జగన్ మాట్లాడారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో జగన్ మాట మార్చారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాజధాని విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుపై కోర్టు మొట్టికాయలు వేసినా కూడా ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఏనాడూ కూడా చూడలేదని చంద్రబాబునాయుడు చెప్పారు.

 వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సీబీఐకి అఫ్రూవర్ గా మారిన దస్తగిరి కూడా ప్రాణభయం ఉందని  చెబుతున్నారనన్నారు.  ఈ  హత్య కేసులో  సాక్షులుగా ఉన్న ఇద్దరు  ఇప్పటికే మరణించారని చంద్రబాబు గుర్తు చేశారు. 

Latest Videos

undefined

రాష్ట్రంలో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నతీరును  చంద్రబాబుతప్పుబట్టారు. పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు టెయింటెడ్ ఆపీసర్లు తయారయ్యారని ఆయన విమర్శించారు. పోలీస్ వ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టించిందని ఆయన ఆరోపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు పోలీస్  శాఖలో కొందరని పెట్టుకున్నారని చంద్రబాబు జగన్ పై ఆరోపణలు చేశారు.  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.  

చట్టాన్నిఅతిక్రమించే వారి గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు చెప్పారు.తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులకైనా శిక్ష తప్పదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.  అంరి చరిత్ర రాసి పెడుతున్నానని చంద్రబాబు చెప్పారు. 

ఎవరికీ అన్యాయం జరిగినా వారికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి  జగన్ సర్కార్ వేధింపులకు గురి చేస్తుందన్నారు. ఎవరు  తప్పు చేసినా సరిచేసే బాధ్యత న్యాయవ్యవస్థదేనన్నారు.  దేశంలో అనేక సంస్కరణలకు టీడీపీ  శ్రీకారం చుట్టిందన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తాను హైద్రాబాద్ ను అభివృద్ది చేసినట్టుగా చెప్పారు. తన తర్వాత వచ్చిన సీఎంలు హైటెక్ సిటీని, ఎయిర్ పోర్టును  అభివృద్ది చేశారన్నారు. ఇవాళ హైద్రాబాద్ ఇలా ఉండడానికి తన విజన్ కారణమని చంద్రబాబు చెప్పారు. 

అమరావతి, పోలవరం లను విధ్వంసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని ముంచేశారన్నారు. విశాఖపట్టణాన్ని తొలుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తమ పార్టీ నేత ప్రవీణ్  కుమార్ రెడ్డి సహా టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. 

తమ  పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ది కోసం అధికారుల సేవలను సమర్ధవంతంగా ఉపయోగించుకుందన్నారు.  నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును రాష్ట్రంలో రాకుండా చేశారన్నారు.బెదిరింపులు,అక్రమ అరెస్టులకు తాను భయపడనన్నారు. పిరికితనం తన జీవితంలో లేదని చంద్రబాబు  చెప్పారు. తనరాజకీయ జీవితంలో అనేక ఒడిదొడుకులను చవిచూసినట్టుగా చంద్రబాబు గుర్తు చేశారు. 

click me!