జగన్ కి ఫోన్ చేద్దామనుకున్నా, అందుకే చెయ్యలేదు: చంద్రబాబు

By Nagaraju TFirst Published Oct 31, 2018, 8:01 PM IST
Highlights

వైఎస్ జగన్ పై దాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు దాడి ఘటన జరిగిన తర్వాత వైఎస్ జగన్ కు ఫోన్ చేద్దామని అనుకున్నానని దాడిని ఖండించడంతోపాటు వివిరాలు తెలుసుకుందామని భావించానని అయితే అప్పటికే తనను ఏ వన్ అంటూ ఆరోపించారని చంద్రబాబు అన్నారు.

అమరావతి: వైఎస్ జగన్ పై దాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు దాడి ఘటన జరిగిన తర్వాత వైఎస్ జగన్ కు ఫోన్ చేద్దామని అనుకున్నానని దాడిని ఖండించడంతోపాటు వివిరాలు తెలుసుకుందామని భావించానని అయితే అప్పటికే తనను ఏ వన్ అంటూ ఆరోపించారని చంద్రబాబు అన్నారు. తనపై నిందలు మోపినప్పుడు  ఇంకెందుకు ఫోన్ చెయ్యాలన్న ఉద్దేశంతో వదిలేశానని తెలిపారు. 

కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉన్న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై దాడి జరిగితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఏంటని నిలదీశారు. జగన్ పై దాడి చేసింది ఆయన వీరాభిమాని అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ప్రాణం అంటూ నిందితుడు శ్రీనివాస్ చెప్పాడని చంద్రబాబు గుర్తు చేశారు. 

జగన్ ఎయిర్ పోర్ట్ లో బాగానే హైదరాబాద్ వెళ్లాడని అక్కడ బీజేపీ డైరెక్షన్ లో డ్రామా చేపట్టారని ఆరోపించారు. జగన్ కు సానుభూతి వస్తుందన్న భావనతోనే తాను దాడి చేశానని నిందితుడు చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. 

జగన్ పై దాడి జరిగిన వెంటనే గవర్నర్ నరసింహన్, కేసీఆర్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ లు ఫోన్ చేస్తారని ప్రకటనలు ఇస్తారని ఇదంతా రాజకీయ కుట్ర కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లు సృష్టించేందుకే వైసీపీ బీజేపీతో కలిసి కుట్రలు పన్నిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ఘటన జరిగితే ఢిల్లీలో వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని కేంద్రం హోంమంత్రి ఇతర రాజకీయ పార్టీలను కలుస్తారంటూ విమర్శించారు. థర్డ్ పార్టీతో విచారణ అయితే వైసీపీ కుట్ర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. థర్డ్ పార్టీలో వైసీపీ కుట్రలు బయటకు రాకుండా ఉండేందుకు ముందస్తు ప్లాన్ వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

జగన్ పై దాడి ఆయనే చేసుకున్నాడని తాను అనుకోవడం లేదని అయితే ఈ దాడిలో నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాము రాష్ట్రప్రయోజనాల కోసమే రాజకీయాలు చేశామే తప్ప హత్యా రాజకీయాలు చెయ్యలేదని తెలిపారు. 

గతంలో తనపై అలిపిరి ఘటన జరిగినప్పుడు తాను బెదిరిపోలేదని ఇతర పార్టీలపై మోపలేదన్నారు. అలిపిరి ఘటనలో వైఎస్ఆర్ అనుంగ శిష్యుడు గంగిరెడ్డి నక్సలైట్లకు సెల్ ఫోన్ లు అందజేశారని ఆ విషయం తమకు తెలుసునని అయినా తాను కక్ష సాధింపుకు పాల్పడలేదని గుర్తు చేశారు. 
 

click me!