నెలరోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ కు పునాది,కేబినేట్ లో క్లియరెన్స్ ఇస్తాం:చంద్రబాబు

By Nagaraju TFirst Published Oct 30, 2018, 7:41 PM IST
Highlights

 స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కడప జిల్లా హక్కు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని మెకాన్‌ సంస్థ రిపోర్ట్‌ ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. మంగళవారం ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రం తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. 

కడప: స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కడప జిల్లా హక్కు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని మెకాన్‌ సంస్థ రిపోర్ట్‌ ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. మంగళవారం ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రం తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. 

కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం ముందుకు వస్తే ఎకరా రూ. 4 లక్షలకే ఇస్తామన్నారు. స్టాంప్‌ డ్యూటీ మినహాయింపుతోపాటు ఒక రూపాయి తక్కువకే విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. అన్ని రాయితీలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. లేనిపక్షంలో కేంద్రం జీఎస్టీ, ఐటీ, క్యాపిటల్‌గూడ్స్‌ మినహాయింపు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
 
ఎవరెన్ని కుట్రలు చేసినా, కేంద్రం సహకరించకపోయినా కడపలో స్టీల్‌ప్లాంట్‌ వచ్చి తీరుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. న్యాయంగా బాధ్యతగా కేంద్రం ముందుకు రాకపోతే గురువారం జరగబోయే కేబినెట్‌ భేటీలో స్టీల్‌ప్లాంట్‌కు క్లియరెన్స్‌ ఇస్తామన్నారు. 

నాకు రాజకీయం కాదు కావాల్సింది అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కడప జిల్లా హక్కు అని అభిప్రాయపడ్డారు. బాధ్యతగా కేంద్రం చేయాల్సింది చేయకపోతే ఎలా చేయించుకోవాలో తమకు తెలుసునన్నారు. కేంద్రం స్టీల్‌ఫ్లాంట్‌ ఏర్పాటు చేయకపోతే నెల రోజుల్లో స్టీల్‌ప్లాంట్‌కు పునాది రాయి వేస్తామని తేల్చిచెప్పారు. 

త్వరలోనే రాయలసీమ రూపురేఖలను మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ గురించి వైసీపీ అధినేత జగన్ ఎందుకు మాట్లాడరని నిలదీశారు. అలాంటి నాయకుడి వల్ల కడప జిల్లాకు నష్టం కలుగుతుందన్నారు. ప్రధాని మోదీని వైసీపీ నాయకులు ఒక్క మాట అనరు. ఇది లాలూచీ రాజకీయం కాదా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వార్తలను కూడా చదవండి

ఏపీలో ఇంకా దాడులు జరుగుతాయ్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు స్క్రిప్ట్ ఢిల్లీలో, విశాఖలో యాక్షన్, గుచ్చింది వైసీపీ కార్యకర్త: కోడి కత్తి డ్రామా అన్నలోకేష్ అసెంబ్లీ సీట్లు పెంచడం లేదు, 175 స్థానాల్లో గెలిచి మా సత్తా చూపుతాం:చంద్రబాబు అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

 

click me!