నేను భయపడను తిరగబడతా, మెడలు వంచుతా: చంద్రబాబు

Published : Nov 02, 2018, 05:47 PM IST
నేను భయపడను తిరగబడతా, మెడలు వంచుతా: చంద్రబాబు

సారాంశం

తాను ఎవరికి భయపడే వ్యక్తిని కాదని తిరగబడతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు విభజన హామీలను నెరవేర్చమంటే కేంద్రం దాడులకు దిగుతోందని ధ్వజమెత్తారు. 

ప్రకాశం: తాను ఎవరికి భయపడే వ్యక్తిని కాదని తిరగబడతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు విభజన హామీలను నెరవేర్చమంటే కేంద్రం దాడులకు దిగుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు చేయిస్తున్నారని ఆరోపించారు.
 
మరోవైపు కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్డీఏ నుంచి తాను బయటకు రాననుకున్నారు కానీ తిరగబడ్డానని చంద్రబాబు తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో అందరినీ కూడగడుతున్నానని తెలిపారు.  తాను ఎవరికీ భయపడను అని కేంద్రం మెడలు వంచుతానని ప్రకటించారు. 

నిత్యం అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కులం, మతం చూసి ఓట్లు వేయవద్దని అభివృద్ధిని చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా ఓటేసి టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu
Pemmasani Chandrasekhar Powerful Speech: Atal Bihari Vajpayee 101st Jayanthi | Asianet News Telugu