సోమవారం కన్నుమూసిన శతాధిక వసంతాలు పూర్తి చేసుకున్న టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన పాడె మోశారు.
గుంటూరు : రాజకీయ కురువృద్ధుడు, టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి Yedlapati Venkatrao అంత్యక్రియలకు ఆ పార్టీ అధినేత Chandrababu naidu హాజరయ్యారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో నిర్వహించిన అంతిమ క్రతువులో చంద్రబాబుతో పాటు టీడీపీ సీనియర్ నేతలు పాల్గొని యడ్లపాటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. టిడిపి జెండా యడ్లపాటి పార్టీ పార్థివ దేహంపై ఉంచిన చంద్రబాబు అంజలి ఘటించారు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని స్మశాన వాటికలో యడ్లపాటి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెనాలిలోని మంచి స్మశాన వాటిక కు సాగిన అంతిమయాత్రలో చంద్రబాబు కాలినడకన వెళ్లి పాల్గొన్నారు.
మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, నక్క ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తదితరులు యడ్లపాటి అంత్యక్రియలకు హాజరై ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన యడ్లపాటి… అనేక పదవులను సమర్థంగా నిర్వహించి టిడిపి పెద్దాయన గా పేరు పొందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే.
undefined
యడ్లపాటి వెంకట్రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత పాల్గొన్న చంద్రబాబు యడ్లపాటి పాడెను పట్టడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యడ్లపాటి వెంకట్రావు జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. యడ్లపాటి మంచి విద్యావంతుడు అని…ప్రజల కోసం జీవితాంతం పని చేశారన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో యడ్లపాటి వెంకట్రావును చూసి నేర్చుకోవాలన్నారు. ఆయన చేసిన పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు ఎనలేనివని చంద్రబాబు కొనియాడారు.
కాగా, సోమవారం రాజ్యసభ సభ్యులు, టిడిపి సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు (104) కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు. యడ్లపాటి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.రైతు నాయకుడుగాను ఆయన సేవలందించారు. సంగం డైరీకి వెంకట్రావు వ్యవసాయ అధ్యక్షుడిగా ఉన్నారు. తెనాలి సమీపంలోని బోడపాటిలో 1919లో జన్మించారు.
1967,1978లో ఎమ్మెల్యేగా విజయం విజయం సాధించిన ఆయన... 1978-80 మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1983లో టిడిపిలో చేరారు. 1995లో గుంటూరు జడ్పీ చైర్మన్ గా, 1998లో రాజ్యసభ సభ్యుడిగా యడ్లపాటి వెంకట్రావు ఎన్నికయ్యారు.