జగన్ మీడియా ప్రభావమా: ఇద్దరు మంత్రులపై బాబు ఆగ్రహం

By pratap reddyFirst Published Aug 25, 2018, 7:26 AM IST
Highlights

కాంగ్రెసుతో పొత్తు వార్తలపై తీవ్రంగా ప్రతిస్పందించిన ఇద్దరు మంత్రులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. 

అమరావతి: కాంగ్రెసుతో పొత్తు వార్తలపై తీవ్రంగా ప్రతిస్పందించిన ఇద్దరు మంత్రులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. 

ఆ ఇద్దరు మంత్రులు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పొత్తుపై పార్టీలో చర్చ జరగకుండానే ఎందుకు మాట్లాడారని చంద్రబాబు వారిపై సీరియస్ అయ్యారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మీడియా ప్రభావానికి లోనై మాట్లాడుతున్నారని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులపై టీడీపి పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుంటారని, ఈ విషయం కూడా సీనియర్ మంత్రులకు తెలియకపోతే ఎలా అని ఆయన అన్నారు. పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ఆయన ఆదేశించారు. 

ఈ ఇద్దరు మంత్రులను పిలిపించి వివరణ కోరాలని చంద్రబాబు పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆదేశించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ప్రజలు బట్టలూడదీసి తంతారని అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో మీడియాతో అన్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని, అది పార్టీ విధానానికి విరుద్ధమని కెఈ కృష్ణమూర్తి కర్నూలులో అన్నారు. 

మీడియా ముందు వారు మాట్లాడడాన్ని చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. మంత్రులు వాడిన భాషను ఆయన తీవ్రంగా తప్పు పట్టినట్లు చెబుతున్నారు. మంత్రులుగా ఉన్నవారికి కనీస క్రమశిక్షణ ఉండవద్దా అని ఆయన ప్రశ్నించినట్లు చెబుతున్నారు. 

click me!