బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కారు ఢీకొని మహిళ మృతి

Published : Aug 24, 2018, 08:25 PM ISTUpdated : Sep 09, 2018, 12:15 PM IST
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కారు ఢీకొని మహిళ మృతి

సారాంశం

గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలోని కొలనుకొండ వద్ద శుక్రవారం సాయంత్రం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు ఢీకొని  ఓ మహిళ మృతి చెందింది.

గుంటూరు:గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలోని కొలనుకొండ వద్ద శుక్రవారం సాయంత్రం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు ఢీకొని  ఓ మహిళ మృతి చెందింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటనలో జీవీఎల్ కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.రోడ్డు దాటుతున్న వారిని తప్పించబోయి బీజేపీ ఎంపీ ప్రయాణిస్తున్న జీవీఎల్ కారు డివైడర్‌ని ఢీకొట్టింది. అనంతరం కారు అదుపు తప్పి మహిళతో పాటు మరో వ్యక్తిని ఢీకొట్టింది. 

 

దీంతో కొద్దిసేపు సంఘటన స్థలంలో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదానికి కారణమైన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనతో జీవీఎల్ నరసింహారావు మరో కారులో వెళ్లిపోయారు.        

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే మ్యాటర్.. దసరా హాలిడేస్ తర్వాత కూడా మరో నాల్రోజులు సెలవులే!
AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...