Chandrababu: చంద్రబాబు రాజశ్యామల యాగం.. అందుకోసమేనా?

By Mahesh K  |  First Published Feb 16, 2024, 8:56 PM IST

చంద్రబాబు ఈ రోజు రాజశ్యామల యాగం చేపట్టారు. భార్య భవనేశ్వరితో కలిసి ఆయన నివాసంలో ఈ యాగం ప్రారంభించారు. ఆదివారం పూర్ణాహుతితో ఈ యాగం పూర్తికానుంది.
 


Raja Shyamala Yagam: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం తన నివాసంలో రాజశ్యామ యాగం చేపట్టారు. మూడు రోజుల పాటు ఈ యాగం కొనసాగనుంది. ఈ యాగంలో భాగంగా శుక్రవారం తొలి రోజు జరిగే పూజలు, క్రతువులు జరిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరిలు పాల్గొన్నారు. 

ఈ యాగ నిర్వహణలో సుమారు 50 మంది రిత్వికులు, పురోహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతితో ఈ యాగం ఆదివారం ముగుస్తుంది. కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు శత చండీ యాగం, మహా సుదర్శన హోమం నిర్వహించిన సంగతి తెలిసిందే.

Latest Videos

తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలాంటి హోమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ రాజ శ్యామల యాగం వంటి అనేక యాగాలు చేపట్టారు. ఎన్నికల ముంగిట్లోనే కేసీఆర్ కూడా ఈ యాగాలు చేశారు. తాజాగా, కేసీఆర్ బాటలోనే చంద్రబాబు కూడా వెళ్లుతున్నట్టు అర్థం అవుతున్నది.

Also Read: PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో మోడీ డబ్బులు ఎప్పుడు పడతాయంటే?

చంద్రబాబు ఈ యాగాలు టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని, లేదా ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆయన చేస్తున్నారా? అనే చర్చ జరుగుతున్నది. అంతేకాదు, బీజేపీతో పొత్తు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ ఈ యాత్ర చేపట్టడంపైనా చర్చిస్తున్నారు.

click me!