ఆ స్వేచ్ఛ లేదా: హీరో రామ్ మీద పోలీసుల వ్యాఖ్యలపై చంద్రబాబు

By team teluguFirst Published Aug 17, 2020, 1:46 PM IST
Highlights

సినీ నటుడు రామ్ పై ఏసిపి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఖండిస్తూ...  ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా నోటీసులు ఇస్తామని బెదిరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. 

స్వర్ణ పాలస్ లో జరిగిన అగ్ని ప్రమాదం, రమేష్ హాస్పిటల్ పై వివాదం చెలరేగుతుండగానే సినీ హీరో రామ్ పోతినేని ఆ విష్యం పై ట్వీట్ చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రమేష్ ఆసుపత్రి యజమాని రామ్ కి దగ్గరి బంధువు అవడం వల్ల రామ్ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. 

ఇక హీరో రామ్ వ్యాఖ్యలపై పోలీసులు మండిపడ్డారు. అవసరమైతే రామ్ కి కూడా నోటీసులు జారీచేస్తామని ఏసీపీ అన్నారు.దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 

 భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని చంద్రబాబు గర్హించారు. సినీ నటుడు రామ్ పై ఏసిపి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఖండిస్తూ...  ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా నోటీసులు ఇస్తామని బెదిరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. 

 ‘‘ రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏవిధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో రుజువు. రాష్ట్రంలో ప్రాధమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ’’గా చంద్రబాబు పేర్కొన్నారు.

ఇకపోతే... రమేష్ చౌదరిది అసలు తప్పేం లేదని, ఆయనను కొందరు కావాలని ఇరికిస్తున్నారని అర్థం వచ్చేలా వరుస ట్వీట్స్ వేయడంతో పాటు, సంఘటనపై విశ్లేషణ ఇచ్చారు. దీనికి నెటిజెన్స్ నుండి పూర్తి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. చనిపోయిన వారి గురించి కాకుండా రామ్ కేవలం తన బాబాయ్ రమేష్ చౌదరికి కొమ్ముకాయటం ఏమిటని తప్పుబట్టారు. 

అలాగే తప్పు చేయకపోతే ఆయన ఎందుకు పారిపోయారో చెప్పాలి అన్నారు. పోలీసులు సైతం కేసు పూర్వాపరాలు తెలియకుండా కామెంట్స్ చేస్తే ఆయనకు నోటీసులు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనితో రామ్ నేడు ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. ఇకపై ఈ విషయం గురించి నేను మాట్లాడాను అని, దుర్మార్గులు శిక్షించబడతారు అని ట్వీట్ చేశారు. అనవసరంగా సెన్సిటివ్ విషయంలోకి ఎంటర్ కావడం ఎందుకు, ఇలాంటి సంజాయిషీలు ఇచ్చుకోవడం ఎందుకు అని అందరూ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.

click me!