బాగా మాట్లాడారు..కానీ.. చంద్రబాబు

By ramya neerukondaFirst Published Sep 6, 2018, 12:22 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, మాణిక్యాలరావులు బాగా మాట్లాడారని.. కానీ కేంద్రం నుంచి డబ్బులు తేవడంలో మాత్రం విఫలమవుతున్నారన్నారు. 
 

బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, మాణిక్యాలరావులు బాగా మాట్లాడారు కానీ.. కేంద్రం నుంచి డబ్బులు తేవడంలో మాత్రం విఫలమయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు చురకలు వేశారు.  ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా.. చంద్రబాబు పలు విషయాలపై మాట్లాడారు.

ప్రాథమిక వైద్యకేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రాథమిక వైద్యకేంద్రాలపై బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, మాణిక్యాలరావులు బాగా మాట్లాడారని.. కానీ కేంద్రం నుంచి డబ్బులు తేవడంలో మాత్రం విఫలమవుతున్నారన్నారు. 

భవనాలు సరిగ్గా లేవన్న విషయంలో వాళ్లతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. సామాన్యుడికి మెరుగైన వైద్యాన్ని అందించాలన్నదే తమ ధ్యేయమన్నారు. అన్ని సబ్ సెంటర్లను, పంచాయతీ, అంగన్ వాడీ, స్కూళ్లు, శ్మశానాల నిర్మాణాలను గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలోనే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

click me!