కుట్ర బయటపడుతుందనే చంద్రబాబు రచ్చ: రఘురామ ఇష్యూపై మిథున్ రెడ్డి

By telugu teamFirst Published May 17, 2021, 10:49 AM IST
Highlights

తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీలు తీవ్రంగా ధ్వజమెత్తారు. కుట్ర బయటపబడుతుందనే భయంతోనే చంద్రబాబు రచ్చ చేస్తున్నారని వారన్నారు.

అమరావతి: తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు వ్యవహారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తమ కుట్ర భయబపడుతుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు రఘురామకృష్ణమ రాజు అరెస్టుపై హడావిడి చేస్తున్నారని మిథున్ రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు గానీ ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి అరెస్టయినప్పుడు చేయని హడావిడి రఘురామ కృష్ణమ రాజు అరెస్టుపై చంద్రబాబు చేయడం అందులో భాగమేనని ఆయన అన్నారు. 

రఘురామ కృష్ణమ రాజు చంద్రబాబు ట్రాక్ లో పడ్డారని, చంద్రబాబు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. కుట్రలో పాలు పంచుకున్నవారంతా బయటకు రావాల్సిందేనని ఆయన అన్నారు. తనను కొట్టారంటూ రఘురామ కృష్ణమ రాజు డ్రామాలు ఆడారని ఆయన విమర్శించారు. పార్టీ రఘురామకు అన్యాయం చేయలేదని ఆయన స్పష్టం చేశఆరు. సీఎం జగన్ రఘురామకు ఇచ్చిన గౌరవం ఇతర పార్టీ ఎంపీలకు ఎవరికీ ఇవ్వలేదని ఆయన అన్నారు. రఘురామకృష్ణమ రాజు విమర్శల్లో కుట్ర కోణం ఉందని ఆయన అన్నారు. 

మతాల మధ్య, కుల్లా మధ్య చిచ్చు పెట్టాలని, ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర చేశారని, దాని వల్ల ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు. కుట్ర బయపడుతుందని చంద్రబాబు రచ్చ చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు అరెస్టయినప్పుడు చేయని హడావిడి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నారని ఆయన అన్నారు. ఓ ఎంపీని అరెస్టు చేయకూడదని ఎక్కడా లేదని, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు అరెస్టు చేసిన విషయాన్ని స్పీకర్ కు తెలియజేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అప్పుడు మాత్రమే స్పీకర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

బిజెపిలో టీడీపీ నేతలు ఉన్నారని, వారు చంద్రబాబు ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్తారని, టీడీపీ పంథాలో బిజెపి నేతలు నడుస్తారని, అందుకే రఘురామ కృష్ణమ రాజు విషయంలో కొంత మంది బిజెపి నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

ఏడాది కాలంగా రఘురామ వ్యవహారాన్ని చూస్తూనే ఉన్నారని, ఎంపీ కాక ముందే ఐదుసార్లు పార్టీలు మారారని, తొలిసారి ఎంపీ అయ్యారని బాలశౌరి చెప్పారు. జగన్ గౌరవించి రఘురామకు పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని, రెండు ప్రధాన కమిటీల్లో స్థానం కల్పించారని, ఇతర పార్టీ లోకసభ సభ్యులెవరికీ జగన్ అంత ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అన్నారు. అయినా ముఖ్యమంత్రిపై అసభ్యకరమైన పదజాలం వాడుతూ మిమిక్రీ చేశారని ఆయన అన్నారు. 

రఘురామ ముందు ఎంపీలను తిట్టారని, తాము ఆయనను పట్టించుకోలేదని, తర్వాత జగన్ మీద విమర్శలు చేస్తూ వచ్చారని బాలశౌరీ చెప్పారు. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను అరేయ్, ఒరేయ్ అంటూ దూషించారని ఆయన గుర్తు చేశారు. తాము మౌనంగా ఉంటాం గానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా అని ఆయన అన్నారు. రఘురామ అసభ్య వ్యవహార శైలి, వాటిన బాష చూస్తే ఎవరికైనా ఎలా ఉంటుదని ఆయన అడిగారు. వెంట్రుక కూడా పీకలేరని అంటే టీడీపీ వాళ్లు, జనసేన వాళ్లు ఊరుకుంటారా అని ఆయన అడిగారు. 

రఘురామకు వైద్య పరీక్షలు చేయడానికి రమేష్ ఆస్పత్రి ఒక్కటే ఉందా అని లావు కృష్ణదేవరాయలు అడిగారు. మనకు తెలిసిన ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించాలా అని అడిగారు. ఇతర ప్రైవేట్ ఆస్పత్రులు లేవా అని అడిగారు. ఎయిమ్స్ కూడా ఉందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 250 మంది దాకా ఎంపీలయ్యారని, ఎవరైనా రఘురామ వాడిన భాష వాడారా అని అన్నారు. జగన్ గౌరవించినా లోపల ఏదో పెట్టుకుని విమర్శలు చేస్తూ వచ్చారని ఆయన అన్నారు

బిజెపికి దగ్గరై తనపై ఉన్న సిబిఐ కేసుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో హిందూ దేవాలయాల గురించి తొలుత రఘురామకృష్ణమ రాజు మాట్లాడారని, అది పారకపోవడంతో కుల ప్రస్తావన చేస్తూ వచ్చారని ఆయన అన్నారు.. ఏడాదిలో ఒక్కసారైనా రఘురామ నియోజకవర్గానికి వెళ్లారా అని ఆయన అడిగారు. ఎంపీని అరెస్టు చేయడానికి స్పీకర్ అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు. 

click me!