పీఎసీ చైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ పేరు ఖరారు

By narsimha lodeFirst Published Jul 24, 2019, 2:50 PM IST
Highlights

పీఏసీ చైర్మెన్ పదవికి పయ్యావుల  కేశవ్ పేరును చంద్రబాబునాయుడు ప్రతిపాదించాడు. పీఏసీ చైర్మెన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇస్తారు


అమరావతి: పీఎసీ ఛైర్మెన్ పదవికి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరును టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  ప్రతిపాదించాడు. పీఎసీ చైర్మెన్ పదవిని  విపక్ష పార్టీకి కట్టబెట్టడం సంప్రదాయం. ఉరవకొండ నుండి కేశవ్ నాలుగో దఫా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

పీఎసీ ఛైర్మెన్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరును చంద్రబాబునాయుడు ప్రతిపాదించారు.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పీఏసీ చైర్మెన్ గా ఉన్నారు. 

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  కంటే ముందు భూమా నాగిరెడ్డి పీఏసీ చైర్మెన్ గా పనిచేశారు. పీఏసీ చైర్మెన్ పదవికి భూమా నాగిరెడ్డి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో బుగ్గనకు ఈ పదవి దక్కింది. 

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారానికి దూరమైంది. దీంతో పీఏసీ చైర్మెన్ పదవి కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పయ్యావుల కేశవ్ పేరును ప్రతిపాదించారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నాగం జనార్ధన్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడులు పీఏసీ చైర్మెన్లుగా పనిచేశారు.

పీఏసీ చైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ తో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్  పేర్లను చంద్రబాబునాయుడు పరిశీలించారు.  బీసీ సామాజికవర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ వైపు మొగ్గు చూపారు చంద్రబాబు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సత్యప్రసాద్  కు ఈ పదవిని కట్టబెట్టాలని కొందరు నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.

అయితే అసెంబ్లీ వ్యవహరాలపై మంచి పట్టున్న పయ్యావుల కేశవ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవి దక్కలేదు. దీంతో కేబినెట్ హోదా దక్కే పీఏసీ చైర్మెన్ పదవిని కేశవ్ కు ిచ్చినట్టుగా చెబుతున్నారు. పయ్యావుల కేశవ్ పేరును పీఏసీ చైర్మెన్ పదవికి ప్రతిపాదిస్తూ చంద్రబాబు స్పీకర్ కు లేఖ పంపారు. 

 

click me!