చాలా ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేములో చంద్రబాబు, దగ్గుబాటి.. అప్యాయంగా పలకరించుకున్న తోడల్లుళ్లు

By Sumanth KanukulaFirst Published Dec 10, 2021, 2:57 PM IST
Highlights

చాలా ఏళ్ల తర్వాత సీనియర్ ఎన్టీఆర్ అల్లుళ్లు.. నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu), దగ్గుబాటి వెంకటేశ్వరరావు (daggubati venkateswara rao) పకపక్కనే నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

చాలా ఏళ్ల తర్వాత సీనియర్ ఎన్టీఆర్ అల్లుళ్లు.. నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu), దగ్గుబాటి వెంకటేశ్వరరావు (daggubati venkateswara rao) పకపక్కనే నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు..సీనియర్ ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమమహేశ్వరి కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతుంది.పెళ్లి వేడుకలో భాగంగా పెళ్లి కుమార్తెను చేసే కార్యక్రమం సందడిగా సాగింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని హోటల్ అవాసాలోని ఈ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన నందమూరి అల్లుళ్లు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి  దంపతులు కలిసి ఫొటోలు దిగారు. 

పెళ్లి కుమార్తెకు.. అటు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇటు నారా భువనేశ్వరి, పురందేశ్వరి పక్కపక్కనే నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు. అయితే రాజకీయ విభేదాలతో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా కాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబంలో జరిగిన వేడుకలు హాజరైనప్పటికీ.. ఎప్పుడు ఇలా సఖ్యతగా కనిపించలేదని రాజకీయ వర్గాల టాక్.

తాజాగా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరావు దంపతులు కలిసి దిగిన ఫొటోలు నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవరకు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయ విబేధాలు చోటుచేసుకోవడం దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ పురంధశ్వేరికి మంచి ప్రాధాన్యత దక్కింది. యూపీఏ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరారు. 

అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ చెంచురాం ఆమె 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో పర్చూర్ నుంచి వైసీపీ తరపును బరిలో నిలిచిన వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్తి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరావు, ఆయన కుమారుడు హితేష్ యాక్టివ్ పొలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు.

ఇటీవల ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఘాటుగా స్పందించిన పురందేశ్వరి..  భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నించడంపై తీవ్రంగా మనస్తాపం చెందినట్లు పేర్కొన్నారు. తానూ, తమ సోదరి నైతిక విలువలతో పెరిగామని పేర్కొన్నారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. తాజాగా ఈ రెండు కుటుంబాలు ఒకే ఫ్రేములో కనిపించడం.. రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అయింది.

click me!