కరోనా వ్యాక్సిన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు ఊహించిందే...ఆశ్చర్యమేమీ లేదు: విజయసాయి సెటైర్లు

Published : Jul 06, 2020, 01:00 PM ISTUpdated : Jul 06, 2020, 01:03 PM IST
కరోనా వ్యాక్సిన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు ఊహించిందే...ఆశ్చర్యమేమీ లేదు: విజయసాయి సెటైర్లు

సారాంశం

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీపై ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు విసిరారు. 

అమరావతి: కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీపై ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు విసిరారు. ఆయన ఇలా మాట్లాడతాడని తాను ముందే ఊహించానని... కాబట్టి ఈ వ్యాఖ్యలు ఏమీ ఆశ్యర్యపర్చలేవని విజయసాయి రెడ్డి అన్నారు.  

''ఆశ్చర్యం లేదు. ఊహించిందే. ప్రపంచంలో ఎక్కడ కోవిడ్ వ్యాక్సిన్ తయారైనా తన ఖాతాలో వేసుకుంటాడని. ప్రపంచ ప్రఖ్యాత అమరావతి మాయా నగరం లాగే ఈయన సృష్టించిన బయోటెక్ పార్కులో వ్యాక్సిన్ తయారవుతోందని ప్రజలంతా కృతజ్ఞత వ్యక్తం చేసారట. మైండ్ డీజనరేట్ అవుతోంది. గొలుసులు సిద్ధం చేయాల్సిందే'' అంటూ  ట్విట్టర్ ద్వారా చంద్రబాబుపై సెటైర్లు వేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. 

read more   పెను ప్రమాదంలో బిజెపి... గ్రహించే లోపే విధ్వంసం: విజయసాయి రెడ్డి

''బాబు లాగే ఆయన క్రిమినల్ మాఫియా 1990 ల నాటి చిప్ లనే వాడుతున్నారు. భాస్కర్ రావు హత్యకు స్కెచ్ వేసి కలెక్టరేట్ కు వెళ్లాడట కొల్లు రవీంద్ర. సెల్ ఫోన్లు, సిసి కెమెరాలు లేనప్పుడు ఈ ఎలిబీలు, సాక్షాలు పనికొచ్చేవేమో. నేరం చేసినా, సుపారి ఇచ్చినా తప్పించుకోలేరు ఇప్పుడు'' అని హెచ్చరించారు. 
 
 ఇక ''బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించానని కోతలు కోస్తున్న బాబు 14 ఏండ్లు సిఎంగా ఉండి ఎన్టీఆర్ కు అత్యున్నత పురస్కారం ఎందుకు ఇప్పించుకోలేక పోయాడు. రాష్ట్రపతులు, ప్రధానులను ఎంపిక చేయడం అబద్ధాలైనా అయి ఉండాలి. ఎన్టీఆర్ కు దక్కకుండా అడ్డుకోనైనా ఉండాలి. ఇందులో ఏది నిజం బాబూ'' అంటూ మరో ట్వీట్ ద్వారా చంద్రబాబును విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu