Polavaram Project: నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యం.. కేంద్రం

By team teluguFirst Published Dec 6, 2021, 5:51 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు (polavaram project ) సంబంధించి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం (central government) కీలక విషయాలను వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి కావడం అసాధ్యమని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు (polavaram project ) సంబంధించి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం (central government) కీలక విషయాలను వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి కావడం అసాధ్యమని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర జల్‌శక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు (Bishweswar Tudu) .. ఈ విషయాన్ని తెలియశారు. పోలవరం పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. పలు కారణాల వల్ల పనుల్లో జాప్యం జరిగిందని వెల్లడించారు. 

‘2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యం జరిగింది. కరోనా వల్ల పోలవరం నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరిగింది. స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తవగా, అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 73 శాతం పూర్తి అయ్యాయి. పైలెట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయి.

పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట వాస్తవమే. అయితే 2020 మార్చిలో సవరించిన అంచనాలపై ఆర్‌సీసీ నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం రూ.35,950.16 కోట్లకు మాత్రమే కేంద్రం అంగీకారం తెలిపింది’ అని మంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 

click me!