ఉద్యోగులకు దసరా కానుక: ఏపీ సర్కార్ కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Oct 24, 2020, 7:28 PM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ దసరా కానుక ప్రకటించింది. డీఏ బకాయిలకు సంబంధించి శనివారం కీలక ప్రకటన చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ దసరా కానుక ప్రకటించింది. డీఏ బకాయిలకు సంబంధించి శనివారం కీలక ప్రకటన చేసింది. విడతల వారీగా మూడు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

వచ్చే ఏడాది జనవరి నుంచి విడతల వారీగా డీఏ బకాయిలను చెల్లించనుంది . రెండో డీఏను జూలై, 2021.. మూడో డీఏను జనవరి 2022 నుంచి చెల్లిస్తామని జగన్ సర్కార్ ప్రకటించింది.

2018 జూలై నుంచి 2019 డిసెంబర్ వరకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే 2020 జనవరి నుంచి రావాల్సిన డీఏను కేంద్రం వాయిదా వేసింది. మార్చి, ఏప్రిల్ నెల సగం జీతాలను కరోనా కారణంగా ఏపీ సర్కార్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ బకాయిలను ఉద్యోగులకు ఐదు విడతలుగా చెల్లించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీతం బకాయిల్లో మొదటి విడత డీఏ బకాయిల విడుల, పెండింగ్ జీతాల క్లియరెన్స్‌లో ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగ సంఘం హర్షం వ్యక్తం చేసింది. 

click me!