ఆయేషా మీరా కేసు: ఏపీ పోలీసులకు చిక్కులు

Published : Dec 13, 2019, 03:42 PM IST
ఆయేషా మీరా కేసు: ఏపీ పోలీసులకు చిక్కులు

సారాంశం

ఆయేషా మీరా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ కేసును దర్యాప్తు చేసిన అప్పటి పోలీసులను ప్రశ్నించాలని సీబీఐ భావిస్తోంది.  

విజయవాడ:ఆయేషా మీరా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ కేసును దర్యాప్తు చేసిన అప్పటి పోలీసులను ప్రశ్నించాలని సీబీఐ భావిస్తోంది.  ఏ కారణాలతో సత్యంబాబును నిందితుడిగా గుర్తించారనే విషయాలపై అప్పటి పోలీసులను సీబీఐ విచారణ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఆయేషా మీరా కేసులో సాక్ష్యాలు ధ్వంసం కావడంతో  ఆ సమయంలో  విచారణ అధికారులుగా పనిచేసిన పోలీసులను ప్రశ్నించి ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టాలని సీబీఐ ప్లాన్ చేసింది.  ఆయేషా మీరా కేసును దర్యాప్తు చేసిన 15 మంది పోలీసు అధికారుల జాబితాను సీబీఐ ఇప్పటికే తయారు చేసింది.ఈ జాబితాఆధారంగా  సీబీఐ అధికారులు  విచారణ చేయనున్నారు.

ఈ కేసులటో తనను ఉద్దేశ్యపూర్వకంగానే ఇరికించారని  సత్యంబాబు ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఆయేషా మీరా హత్య జరిగి 11 ఏళ్లు దాటింది. ఈ తరుణంలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకొంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణను సిట్ విచారించింది.

ఈ కేసులో సిట్‌లో ఉన్న అధికారులతో పాటు హత్య జరిగిన సమయంలో దర్యాప్తు జరిపిన  పోలీసు అధికారులను సీబీఐ విచారణ చేసే  అవకాశం ఉంది.  ఫిబ్రవరి మొదటి వారంలో  సీబీఐ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu