వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు:సీబీఐ విచారణ మళ్లీ షురూ

By narsimha lodeFirst Published Apr 12, 2021, 3:31 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ తిరిగి ప్రారంభించింది. రెండేళ్లైనా కూడ ఈ కేసులో ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడంపై వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ తిరిగి ప్రారంభించింది. రెండేళ్లైనా కూడ ఈ కేసులో ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడంపై వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

సోమవారం నాడు సీబీఐ అధికారులు ఈ కేసులో అనుమానితులను విచారించారు. వివేకానందరెడ్డి సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేకా పీఏ ఇనయతుల్లాను సీబీఐ అధికారులు విచారించారు.వివేకా ఇంటి వద్ద ఉన్న పాల డైరీ, సెల్ పాయిట్ యజమానులను కూడ సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

2019 మార్చి 14వ తేదీన వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నాడు.  ఈ విషయమై చంద్రబాబునాయుడు సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది.2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జగన్ సర్కార్ కూడా మరో సిట్ ను ఏర్పాటు చేసింది. 

ఈ కేసు దర్యాప్తులో తమకు కొందరిపై అనుమానాలను ఉన్నాయని చెబుతూ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ విచారణ చేయించాలని కోరింది. ఇదే విషయమై టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి కూడ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే సీబీఐ విచారణ కొనసాగుతోంది. రెండేళ్లుగా ఈ కేసులో ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడంపై డాక్టర్ సునీత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
 

click me!