వివేకా హత్య కేసు: పులివెందులలో మరోసారి సీబీఐ విచారణ

Siva Kodati |  
Published : Sep 12, 2020, 06:42 PM IST
వివేకా హత్య కేసు: పులివెందులలో మరోసారి సీబీఐ విచారణ

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై కడప జిల్లా పులివెందులలో మరోసారి సీబీఐ విచారణ మొదలుపెట్టింది. జూలైలో మొదటిసారి సీబీఐ విచారణ ప్రారంభించాక రెండు వారాల పాటు పలువురు సాక్ష్యులు, అనుమానితులను అధికారులు ప్రశ్నించారు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై కడప జిల్లా పులివెందులలో మరోసారి సీబీఐ విచారణ మొదలుపెట్టింది. జూలైలో మొదటిసారి సీబీఐ విచారణ ప్రారంభించాక రెండు వారాల పాటు పలువురు సాక్ష్యులు, అనుమానితులను అధికారులు ప్రశ్నించారు.

వివేకా కూతురు సునీత సమక్షంలోనూ విచారణ సాగింది. తిరిగి 40 రోజుల తర్వాత సీబీఐ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే..సీబీఐ విచారణకు వివేకా కుమార్తె సునీత హాజర‌య్యారు.

సెంట్రల్ జైల్లో ఉన్న గెస్ట్ హౌస్ లో ప్రత్యేక విచారణ అధికారి నేతృత్వంలో సునీతను 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు సీబీఐ అధికారులు. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని పరిస్థితులపై సునీతను ద‌గ్గ‌ర్నుంచి వివ‌రాలు సేక‌రించారు.

ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఇవాళ కూడా మరికొందరిని విచారించే అవకాశం ఉంది. కాగా గ‌త‌ ఆదివారం సిట్ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. 3 బ్యాగుల్లో ఉన్న నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ ఆఫిస‌ర్స్..కీల‌క అనుమానితుల‌పై ఫోక‌స్ పెట్టారు.

ఇప్పటికే 15 మంది అనుమానితుల లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం. సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వివేకా తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే

PREV
click me!

Recommended Stories

ధవళేశ్వరం బ్యారేజ్ పరిశీలించిన సీఎం చంద్రబాబు | Sir Arthur Cotton Barrage Gate Renovation
పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage