వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్: కౌంటర్ దాఖలుకు సీబీఐకి కోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Jun 2, 2023, 12:41 PM IST
Highlights

మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో  కౌంటర్ దాఖలు  చేయాలని సీబీఐని ఆదేశించింది.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు నిందితుడు  వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల  5వ తేదీకి  నాంపల్లి సీబీఐ  కోర్టు  వాయిదా వేసింది.  తనకు  బెయిల్ మంజూరు చేయాలని  కోరుతూ  సీబీఐ  కోర్టులో  వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు  చేశారు.ఈ పిటిషన్ పై  కౌంటర్ దాఖలు  చేయాలని సీబీఐని  కోర్టు  శుక్రవానంనాడు ఆదేశించింది.

మరో వైపు  ఇదే కేసులో  నిందితులుగా  ఉన్న  ఎర్ర గంగిరెడ్డి,  సునీల్ యాదవ్,  ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి  శివశంకర్ రెడ్డిలను కూడ  సీబీఐ అధికారులు కోర్టులో హాజరు పర్చారు.  ఈ నిందితులను  జ్యుడిషీయల్ రిమాండ్  కు తరలించాలని కోర్టు  ఆదేశించింది.  మరో వైపు  అనారోగ్య  కారణాలతో  వైఎస్ భాస్కర్ రెడ్డి  కోర్టుకు  హాజరుకాలేకపోయినట్టుగా  ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ఇదిలా ఉంటే  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  అఫ్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి  ఇవాళ కూడ కోర్టుకు  హాజరు కాలేదు. వ్యక్తిగత  కారణాలతోనే  విచారణకు  హాజరు కాలేకపోయినట్టుగా  దస్గతిరి  కోర్టుకు సమాచారం  ఇచ్చారని సమాచారం.   వైఎస్ భాస్కర్ రెడ్డి  బెయిల్ పిటిషన్ పై  సీబీఐ వాదనల తర్వాత  కోర్టు  నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ  ఏడాది  ఏప్రిల్  16వ తేదీన   పులివెందులలో  వైఎస్ భాస్కర్ రెడ్డిని  సీబీఐ  అరెస్ట్  చేసింది.  అప్పటినుండి  వైఎస్ భాస్కర్ రెడ్డి జైల్లోనే  ఉన్నారు.

also read:కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
2019 మార్చి  14వ తేదీ  రాత్రి  పులివెందులలో  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సిట్  ను ఏర్పాటు  చేశారు. వైఎస్ జగన్ సీఎంగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరో సిట్  ఏర్పాటైంది.   అయితే  ఈ కేసును సీబీఐతో  విచారణ జరిపించాలని   ఏపీ హైకోర్టులో  దాఖలైన పిటిషన్ పై  విచారణ నిర్వహించిన  హైకోర్టు  సీబీఐ  విచారణకు ఆదేశాలు   జారీ  చేసింది. 
 

click me!