షాక్ :మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు, ఆపీసుల్లో సీబీఐ సోదాలు

By narsimha lodeFirst Published Dec 31, 2019, 8:58 AM IST
Highlights

టీీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాాంబశివరావు ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 


గుంటూరు: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారంనాడు ఉదయం నుండి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

రాయపాటి సాంబశివరావుకు చెందిన ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై కూడ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైద్రాబాద్, గుంటూరు, విజయవాడల్లో ఏక కాలంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.రూ. 300 కోట్లు బ్యాంకు రుణం తీసుకొన్న రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఎగ్గొట్టడంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది.రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ గతంలో పోలవరం ప్రాజెక్టు పనులను చేసింది. 

నర్సరావుపేట ఎంపీగా 2019 ఎన్నికల్లో  రాయపాటి సాంబశివరావు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014లో నర్సరావుపేట ఎంపీ స్తానం నుండి తొలిసారిగా టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు

ఎన్నికల ఫలితాల తర్వాత రాయపాటి సాంబశివరావు టీడీపీని వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ రాయపాటి సాంబశివరావు మాత్రం తనకు వైసీపీ, బీజేపీ నుండి ఆహ్వానాలు అందుతున్నాయని కూడ గతంలో ప్రకటించారు. కానీ  కారణాలు ఏవో కానీ ఆయన ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు.

click me!