ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం...

By SumaBala Bukka  |  First Published Nov 14, 2023, 11:11 AM IST

ఆంధ్రప్రదేశ్ లో కులగణన ప్రక్రియ రెండు రోజులపాటు ప్రయోగాత్మకంగా జరగనుంది.  


అమరావతి :  ఏపీలో సమగ్ర కులగణన కోసం గత ఎనిమిది నెలలుగా జగన్ సర్కార్ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆరుగురు అధికారుల కమిటీ దేశంలో కులగణన చేపట్టిన రాష్ట్రాల్లో ఈ మధ్యనే పర్యటించారు. కులగణన విషయంలో న్యాయపరంగా వచ్చే ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకున్నారు. 

వీటన్నింటినీ క్రోఢీకరించి కులగణన ఎలా చేపట్టాలి? ఎలాంటి సమాచారం తీసుకోవాలి? అన్న అంశం మీద కమిటీ ప్రభుత్వానికి ఓ రిపోర్గు కూడా ఇచ్చింది. ఈ రిపోర్టు ప్రకారమే ఏపీలో ఉన్న సుమారు కోటి 60 లక్షల కుటుంబాలను ప్రభుత్వం సర్వే చేయనుంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి ఏపీలో కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా ఈ కులగణన ప్రక్రియను మొదలుపెట్టబోతున్నారు.

Latest Videos

ఆంధ్ర ప్రదేశ్ దివాళా తీసిందనడానికి ఇదొక్కటి చాలదా..!: జగన్ సర్కార్ పై లోకేష్ ఫైర్

గ్రామ, వార్డు  సచివాలయసిబ్బంది, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి డేటా సేకరిస్తారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన యాప్ ను కూడా తీసుకొచ్చింది. సేకరించిన డాటా మొత్తాన్ని డిజిటల్ పద్ధతిలో యాప్ లోనే అప్లోడ్ చేస్తారు.ఇక ఈ కులగణన ప్రక్రియ రేపు మూడు గ్రామ సచివాలయాలు,  రెండు వార్డు సచివాలయాల పరిధిలో ప్రారంభం అవుతుంది.  ఈ కులగణన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.

రెండు రోజులపాటు ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ జరగనుంది.  ఈనెల 22 వరకు కులగణన ప్రక్రియపై శిక్షణ ఉంటుంది.  కులగణనపై ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తారు. రేపటి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరుగుతాయి. దీనికి సంబంధించి ప్రాంతీయ సదస్సులను ఈ నెల 17న రాజమండ్రి కర్నూలులో  నిర్వహిస్తారు. వీటితోపాటు ఈనెల 20వ తారీకున  విశాఖపట్నం, విజయవాడలో,  24వ తేదీన తిరుపతిలో నిర్వహించనున్నారు. 

click me!