ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు... పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

By Siva KodatiFirst Published Nov 12, 2022, 3:47 PM IST
Highlights

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శించేందుకు కారు టాప్‌పై కూర్చొని జాతీయ రాహదారిపై ప్రయాణించడంపై ఈ కేసు నమోదైంది. 

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శించేందుకు మంగళగిరి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజున కొద్దిదూరం కాలినడకన ప్రయాణించిన పవన్.. తర్వాత కారు టాప్‌పై కూర్చొని జాతీయ రాహదారిపై ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా దీనిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శివకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. టాప్ పైన కూర్చొని ప్రయాణించడం ప్రమాదకరమని.. ఆ సమయంలో పవన్ కాన్వాయ్‌లో అనేక వాహనాలు వున్నాయని శివకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌పై ఐపీసీ 336, రెడ్ విత్ 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 

ఇకపోతే.. శుక్రవారం రాత్రి విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిణామాలు, ఇక్కడ చోటు చేసుకుంటున్న దారుణాలను పవన్ కళ్యాణ్ ప్రధానికి నివేదించారు. ఆయన ఇవన్నీ సావధానంగా వింటూనే..ఇంకా ఇంకా అని అడుగుతూనే మధ్యలో ఆయన ‘ఐ నో ఎవ్రీథింగ్’, ‘ఐ నో ఇట్ ఆల్సో’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 

ALso REad:మోదీ, పవన్ భేటీ : ఇది మన మొదటి సమావేశమే.. ఇకనుంచి తరచూ కలుద్దాం.. జనసే అధినేతతో ప్రధాని..

రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడుల నుంచి తాజాగా ఇప్పటంలో కక్షపూరిత రాజకీయాలను వరకు అనేక అంశాలను పవన్ కళ్యాణ్  క్లుప్తంగా ప్రధానికి వివరించారు. రామతీర్థం ఆలయం, అంతర్వేది రథం దగ్ధం నాటి పరిస్థితులను నివేదించారు. విశాఖలో పవన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను కూడా వివరించగా మోడీ తనకు అన్నీ తెలుసునని చెప్పారు. భూముల ఆక్రమణ వల్ల  పర్యావరణానికి నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం వాటిని సద్వినియోగం చేయడం లేదని, పైగా వాటిని ఇతర అవసరాలకు ఇస్తోందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నా.. ఎక్కడా ఆ ప్రస్తావన ఉండడం లేదని తాము పేదల ఇళ్లపై ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నామని కూడా తెలియజేశారు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే అనైతికంగా వ్యవహరిస్తున్న తీరునూ ప్రస్తావించారు. 

click me!