అధికారులకు వార్నింగ్.. సర్కార్ సీరియస్: జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

By Siva KodatiFirst Published Oct 10, 2020, 8:43 PM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. శుక్రవారం తాడిపత్రిలో గనుల శాఖ అధికారులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు జేసీ. ఇప్పుడు తనకు సన్మానం చేస్తున్నారని.. త్వరలోనే తాను చేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. శుక్రవారం తాడిపత్రిలో గనుల శాఖ అధికారులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు జేసీ.

ఇప్పుడు తనకు సన్మానం చేస్తున్నారని.. త్వరలోనే తాను చేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీంతో జేసీపై 156 (ఏ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అనంతపురం జిల్లా ముచ్చుకోటలో జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన క్వారీల్లో మైనింగ్‌ శాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. మైనింగ్‌కు సంబంధించి అధికారులు వివరాలు సేకరించారు. దీంతో జేసీ దివాకర్‌ రెడ్డి మైనింగ్‌ శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు.

కాగా, గతంలోనూ జేసీ దివాకర్‌ రెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డి కూడా విధుల్లో ఉన్న సీఐ ప‌ట్ల దురుసుగా ప్రవ‌ర్తించడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. పలు కేసుల్లో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలు వెళ్లి.. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు.

click me!