చంద్రబాబు కోసం ఇంటి భోజనం.. మెనూ ఇదే, కాసేపట్లో కుటుంబ సభ్యులతో భేటీ

Siva Kodati |  
Published : Sep 11, 2023, 02:32 PM IST
చంద్రబాబు కోసం ఇంటి భోజనం.. మెనూ ఇదే, కాసేపట్లో కుటుంబ సభ్యులతో భేటీ

సారాంశం

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో 14 రోజుల రిమాండ్ విధించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఆయన కోసం ఇంటి నుంచి భోజనం పంపారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో 14 రోజుల రిమాండ్ విధించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే జైలులో ప్రత్యేక వసతులు కల్పించేందుకు కోర్ట్ అనుమతించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు కోసం సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి భోజనం వచ్చింది. చంద్రబాబుకు మధ్యాహ్నం భోజనంగా 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపారు కుటుంబ సభ్యులు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు టీ తాగేందుకు వేడినీళ్లు అందజేశారు. మరోవైపు కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చిన భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిలు రానున్నారు. 3 గంటలకు చంద్రబాబుతో వీరు భేటీ కానున్నారు.

మరోవైపు.. చంద్రబాబు నాయుడు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ.. మరో కేసులో కూడా ఆయనపై పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకలకు సంబంధించిన కేసులో చంద్రబాబును విచారించేందుకు అనుమతి కోరుతూ సీఐడీ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా సమాచారం. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్‌ కోసం పీటీ వారెంట్‌ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరనున్నట్టుగా తెలుస్తోంది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. 

అటూ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసుతో పాటు, ఇటూ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకలకు సంబంధించిన కేసులో కూడా చంద్రబాబును విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుతో పాటు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణ, మరికొందరిపై సీఐడీ అధికారులు గతంలోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్‌ ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna