నడిరోడ్డుపై కారు దగ్ధం.. రెప్పపాటులో తప్పిన ముప్పు

Siva Kodati |  
Published : May 01, 2019, 01:01 PM IST
నడిరోడ్డుపై కారు దగ్ధం.. రెప్పపాటులో తప్పిన ముప్పు

సారాంశం

కృష్ణా జిల్లాలో జాతీయ రహదారిపై కారు దగ్ధమైపోవడం స్ధానికులను భయాందోళనలకు గురిచేసింది. 

కృష్ణా జిల్లాలో జాతీయ రహదారిపై కారు దగ్ధమైపోవడం స్ధానికులను భయాందోళనలకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన మల్లాది నరసింహ శాస్త్రి పాలకొల్లులోని తమ బంధువుల ఇంటికి మంగళవారం రాత్రి తమ ఐ టెన్ కారులో బయలుదేరారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం విజయవాడ రూరల్ మండలం నిడమానురు వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారును డ్రైవ్ చేస్తున్న నరసింహ శాస్త్రి వెంటనే కారును పక్కన ఆపారు.

వెంటనే కారులో ఉన్న వారిని అప్రమత్తం చేసి కిందకి దించేశాడు. ఆ కొద్దిసేపటికే మంటలు వ్యాపించి కారు మొత్తం దగ్థమైంది. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Return rush: పండ‌గ అయిపోయింది.. ప‌ల్లె ప‌ట్నం బాట ప‌ట్టింది. హైవేపై ఎక్క‌డ చూసినా వాహ‌నాలే
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet