విశాఖలో కారు బీభత్సం... 8 బైక్ లు, డివైడర్ ను ఢీకొట్టి, చెట్టెక్కించిన డ్రంకెన్ డాక్టర్.! (వీడియో)

Published : Aug 02, 2023, 11:36 AM ISTUpdated : Aug 02, 2023, 11:44 AM IST
విశాఖలో కారు బీభత్సం... 8 బైక్ లు, డివైడర్ ను ఢీకొట్టి, చెట్టెక్కించిన డ్రంకెన్ డాక్టర్.! (వీడియో)

సారాంశం

విశాఖపట్నంలో మంగళవారం అర్ధరాత్రి ఓ మహిళా వైద్యురాలు మద్యంమత్తులో కారునడిపి నానా బీభత్సం సృష్టించింది. 

విశాఖపట్నం : మద్యం మత్తులో కారు నడిపి ఓ వైద్యురాలు విశాఖపట్నంలో బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి రోడ్డుపక్కన పార్క్ చేసిన వాహనాలపైకి దూసుకెళ్ళిన కారు డివైడర్ పైకి ఎక్కి ఆగింది. ఈ సమయంలో వాహనాల వద్ద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.  

స్థానికుల కథనం ప్రకారం... మంగళవారం అర్థరాత్రి విశాఖపట్నంలోని రామాటాకీస్ వైపునుండి సిరిపురం వైపు మితిమీరిన వేగంతో దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పింది. విఐపి రోడ్డులోని ప్యారడైజ్ హోటల్ సమీపంలో నిలిపిన ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా పుట్ ఫాత్ పైకి ఎక్కిన కారు చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో ఏడు  ద్విచక్ర వాహనాలతో పాటు కారు ధ్వంసమయ్యింది. 

వీడియో

నగరానికి చెందిన ఓ వైద్యురాలు మద్యం మత్తులో చేసిన ర్యాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత మరో కారులో డాక్టర్ పరారయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu