ఢిల్లీ నుంచి ఫోన్.: హుటాహుటిన హస్తినకు పవన్ కల్యాణ్, మతలబు?

By telugu teamFirst Published Jan 11, 2020, 1:31 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హుటాహుటిన దేశ రాజధాని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో ఆయన హస్తిన పయనం పెట్టుకున్నట్లు చెబుతున్నారు. జగన్ ప్రతిపాదనను పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ హుటాహుటిన దేశ రాజధాని హస్తినకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి ప్రయాణమయ్యారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ముగించుకుని ఆయన ఢిల్లీకి వెళ్లారు. అమరావతి పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఆయన హస్తినకు వెళ్లారు.

ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే, ఆయనకు ఎవరు ఫోన్ చేశారనేది తెలియడం లేదు. బహుశా బిజెపి పెద్దల నుంచి ఫోన్ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై ఆయన కేంద్రంలోని పెద్దలతో మాట్లాడుతారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని తాను కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్తానని ఇటీవల ఓసారి అన్నారు. ఇదే విషయంపై ఆయన ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు.

అమరావతిలో రైతుల ఆందోళనను, ఇతర విషయాలను ఆయన కేంద్రం పెద్దలతో మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖపట్నం తరలించడం వల్ల అమరావతిని వదిలేయడం వల్ల సంభవించే పరిణామాలపై ఆయన బిజెపి పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. 

గత కొద్ది రోజులుగా కేంద్రం జగన్ ప్రతిపాదన వల్ల సంభవించిన పరిణామాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రతిపాదనను తాను వ్యతిరేకిస్తున్నట్లు, ఈ విషయంపై తాను పోరాటం చేయనున్నట్లు, బిెజపి పెద్దల నుంచి తనకు సహకారం లభించకపోయినా వ్యక్తిగతంగా పోరాటం చేయనున్నట్లు బిజెపి ఎంపీ సుజనా చౌదరి శనివారంనాడు తెలిపారు. 

click me!