చంద్రబాబు మాట: మనిషై పుట్టాక ఆ పని చేయాల్సిందే...

Published : Aug 25, 2018, 12:54 PM ISTUpdated : Sep 09, 2018, 11:10 AM IST
చంద్రబాబు మాట: మనిషై పుట్టాక ఆ పని చేయాల్సిందే...

సారాంశం

మనిషి అయి పుట్టాక కాస్త కళాపోషణ ఉండాలని సినీనటుడు రావుగోపాలరావు గారంటే......మనిషి అయి పుట్టాక కనీసం ఒక చెట్టు నాటాల్సిందేనంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 

కడప: మనిషి అయి పుట్టాక కాస్త కళాపోషణ ఉండాలని సినీనటుడు రావుగోపాలరావు గారంటే......మనిషి అయి పుట్టాక కనీసం ఒక చెట్టు నాటాల్సిందేనంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కడప జిల్లా యోగి వేమన యూనివర్శిటీలో వనం మనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు నాయుడు మెుక్కల ఆవశ్యకతపై విద్యార్థులతో ముచ్చటించారు.

 ప్రతీ ఒక్కరూ మెుక్క నాటాలని పిలుపునిచ్చారు. స్నేహితుడు ఆపదలో ఆదుకోకపోవచ్చునేమో కానీ మెుక్క మాత్రం ఎప్పుడు ఆదుకుంటుందన్నారు. మెుక్క ప్రతీ ఒక్కరికి మంచి స్నేహితుడు అని అభివర్ణించారు. మనిషి అయి పుట్టాక ప్రతీ ఒక్కరూ మెుక్క నాటాల్సిందేనని నాటకపోతే వాళ్లసలు మనిషే కాదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu