ఏపీ హైకోర్టు సీజేగా ప్రవీణ్‌కుమార్: నేపథ్యమిదీ

By narsimha lodeFirst Published Dec 27, 2018, 5:30 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ గురువారం నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ గురువారం నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

1961 ఫిబ్రవరి 26వ, తేదీన హైద్రాబాద్‌ లో ప్రవీణ్ కుమార్ జన్మించారు. హైద్రాబాద్ లిటిల్‌ఫ్లవర్ స్కూల్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. నిజాం కాలేజీలో బీఎస్సీని పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీలో లా పూర్తి చేశారు.

1986లో న్యాయవాద వృత్తిని ప్రవీణ్ కుమార్ చేపట్టారు.క్రిమినల్ లాయర్‌గా ప్రవీణ్‌కుమార్‌కు మంచి పేరుంది. 2012లో ఏపీ హైకోర్టులో  ప్రవీణ్ కుమార్ అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు.2013లో పూర్తిస్థాయి జడ్జిగా ప్రవీణ్‌కుమార్ కొనసాగుతున్నారు. 1986 ఫిబ్రవరి 28వ తేదీన ప్రముఖ న్యాయవాది సి. పద్మనాభరెడ్డి వద్ద న్యాయవాద వృత్తిని  ప్రారంభించారు.

వచ్చే ఏడాది (2019) జనవరి 1వ తేదీ నుండి అమరావతిలో ఏపీ రాష్ట్ర హైకోర్టు పని చేయనుంది. ఇప్పటికే ఏపీ రాష్ట్రానికి 16 మంది జడ్జిలను, తెలంగాణకు 10 మంది జడ్జిలను కేటాయిస్తూ బుధవారం నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో  వేర్వేరు హైకోర్టులు పనిచేయనున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో సిటీ సివిల్ కోర్టు భవనంలో  హైకోర్టును కొనసాగించాలని భావించారు.అయితే ఈ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 

దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి హైకోర్టు తాత్కాలిక కార్యాలయాన్ని కొనసాగించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఈ కార్యాలయంలో  న్యాయమూర్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ సీఎం ఆదేశించారు.

జనవరి 5 నుండి 20వ తేదీ వరకు హైకోర్టుకు సెలవులు. ఈ సెలవులు పూర్తయ్యే లోపుగా  సిటీ సివిల్ కోర్టు భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జనవరి 20వ తేదీ తర్వాత సిటీ సివిల్ కోర్టు భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
 

సంబంధిత వార్తలు

హైకోర్టు విభజనకు మోక్షం: కేంద్రం నోటిఫికేషన్ జారీ

 

 

click me!