మా హామీలు, కేసీఆర్ స్కీమ్స్ కాపీ: చంద్రబాబుపై బుగ్గన ఫైర్

By Nagaraju TFirst Published Jan 22, 2019, 4:52 PM IST
Highlights

ఒక ముఖ్యమంత్రిగా ఉండి సొంతంగా పథకాలు రూపొందింలేక ఇతర పార్టీలవి కాపీకొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాలు తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కోల్ కత్తా వెళ్లి వచ్చిరాని ఇంగ్లీషులో శ్రీరంగ నీతులు చెప్పారంటూ విమర్శించారు. 
 

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలన్నీ వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పథకాలనే చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని విమర్శించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాయలంలో మీడియాతో మాట్లాడిన బుగ్గన ఆటోలు, ట్రాక్టర్ల లైఫ్ టాక్స్‌ల రద్దు నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిందేనని దాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. అలాగే వృద్ధులకు రూ.2వేలు పింఛన్ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో ప్రకటించారని అది కూడా కాపీ కొట్టారంటూ మండిపడ్డారు. 

ఒక ముఖ్యమంత్రిగా ఉండి సొంతంగా పథకాలు రూపొందింలేక ఇతర పార్టీలవి కాపీకొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాలు తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కోల్ కత్తా వెళ్లి వచ్చిరాని ఇంగ్లీషులో శ్రీరంగ నీతులు చెప్పారంటూ విమర్శించారు. 

పార్టీ ఫిరాయింపులపై తానేదో నీతిమంతుడులా చెప్పిన చంద్రబాబు నాయుడు ఏపీలో తమరు చేసిందేమిటని బుగ్గన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కనుగోలు చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. 

ఆ ఎమ్మెల్యేలలో కొందరిని మంత్రులను చేసింది వాస్తవం కాదా అంటూ కడిగిపారేశారు. ఏపీలో నీచరాజకీయాలకు పాల్పడి ఇతర రాష్ట్రాల్లో నీతులు చెప్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని తన చుట్టూ ఉంది మామూలు వ్యక్తులు కాదని రాజకీయ ఉద్దండులని గుర్తు చేశారు. 

చంద్రబాబు నాయుడుగా మాట్లాడితే తప్పులేదని ఒక బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే తెలుగువారి పరువు పోతుందని చెప్పారు. నీతి నిజాయితీల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ఆయన ఎంత నీతిమంతుడో అస్సాం వెళ్లి అడిగినా చెప్తారని చెప్పుకొచ్చారు. 

భారతదేశంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని తేలిందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసాధ్యమైన మాటలు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ తానే కట్టానని చెప్తున్న చంద్రబాబు అది అసలు వాస్తవమా కాదా ప్రజలు నమ్ముతారా లేదా అన్నది కూడా ఆలోచించడం లేదన్నారు. 

వ్యవసాయంలో నోబెల్ బహుమతి ఇస్తానని చెప్తున్నాడని అసలు నోబెల్ అవార్డులలో వ్యవసాయానికి స్థానం లేదన్నారు. నోబెల్ అవార్డు గెలిస్తే వంద కోట్లు ఇస్తామని చెప్తున్నారని ఇవన్నీ పిచ్చిమాటలు కాదా అని చెప్పుకొచ్చారు. 

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో ఒలింపిక్స్ పెడతానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారని అది అసలు సాధ్యమా అంటూ ప్రశ్నించారు. కబడ్డీ మ్యాచ్, కోకో మ్యాచ్ నిర్వహిస్తా అంటే నమ్ముతారు కానీ ఒలింపిక్స్ అంటే నవ్వుకుంటున్నారు జనాలని తెలిపారు. 1929లో స్పెయిన్ దేశంలో భారత్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని అప్లై చేస్తే రాకరాక 1992లో భారతదేశంలో ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం వచ్చిందని గుర్తు చేశారు.    
 

click me!