26 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Siva Kodati |  
Published : Jun 12, 2019, 07:19 PM IST
26 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

సారాంశం

ఈ నెల 26 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరపనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సుమారు 26 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. 

ఈ నెల 26 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరపనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సుమారు 26 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. కాగా... కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి సమావేశమైన శాసనసభలో బుధవారం కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

నూతన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ శంబంగి అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. తొలి రోజు మొత్తం 173 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నరసరావుపుట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాల రీత్యా సభకు హాజరు కాలేదు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభను ప్రొటెం స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్