వెంచర్ పై దాడి.. అజ్ఞాతంలోకి బీటెక్ రవి..

Published : May 01, 2023, 02:59 PM IST
వెంచర్ పై దాడి.. అజ్ఞాతంలోకి బీటెక్ రవి..

సారాంశం

ఓ వెంచర్ మీద దాడి ఘటనలో బీటెక్ రవిపై కేసు నమోదయ్యింది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు.   

వైయస్సార్ జిల్లా : టిడిపి నేత మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆదివారం బిటెక్ రవి తన అనుచరులతో పులివెందుల పరిధిలోని చక్రాయపేటలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఓ వెంచర్ పై దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. ఈ దాడిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీంతో.. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందేమోనని.. ముందస్తుగా బీ టెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బీటెక్ రవి ఆదివారం వందమందికి పైగా అనుచరులతో, మారణాయుధాలతో బెదిరించాడు. ఆ తరువాత అతని వెంచర్ లో ఉన్న ఫెన్సింగ్ ను కూడా అన్యాయంగా తన అనుచరులు తొలగించారు. ఈ ఘటనపై ఆ వెంచర్ ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ వెంచర్ తనదని... తన దగ్గర వెంచర్ కు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని అతను తెలిపాడు. రవి దగ్గర వెంచర్ కు సంబంధించిన అలాంటి ఆధారాలు ఏవైనా ఉంటే చూపించాలని రవికి సూచించాడు.

చక్రాయ పేట దాడిపై బాధితుడి ఫిర్యాదు మేరకు..  పోలీసులు కేసు నమోదు చేసుకున్నఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, బీటెక్ రవి ఆచూకీ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్