మండపేటలో బాలుడి కిడ్నాప్: ఇంకా దొరకని ఆచూకీ

Published : Jul 23, 2019, 08:15 AM IST
మండపేటలో బాలుడి కిడ్నాప్: ఇంకా దొరకని ఆచూకీ

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చిన్నారి బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలిసిన వారే బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  

మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బాలుడిని కిడ్నాప్ చేశారు. తెలిసిన వారే బాలుడిని కిడ్నాప్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మండపేటలోని యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్  కొడుకును సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు కిడ్నాప్ చేశారు. 

బాలుడి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మనమడితో పార్వతి అనే మహిళ బయటకు వెళ్లింది. ఈ సమయంలో కిడ్నాపర్ పార్వతిపై దాడి చేసి బాలుడిని కిడ్నాప్ చేశారు. 

ఈ విషయమై బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాలింపు జరుపుతున్నారు. తెలిసినవారే బాలుడిని కొంత దూరం వెంబడించారు. అయితే క్షణాల్లోనే నిందితులు పారిపోయారని స్థానికులు చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu