నేను పోటీ చెయ్యను, నా కొడుక్కి అవకాశం ఇవ్వండి: చంద్రబాబుతో మాజీమంత్రి

By Nagaraju penumalaFirst Published Feb 21, 2019, 9:00 AM IST
Highlights

ఇకపోతే ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని చెప్పారు. అయితే శ్రీకాళహస్తి టికెట్ ను తన కుమారుడు సుధీర్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. అయితే తనయుడు కాకుండా మీరే చెయ్యాలంటూ బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మెుదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీలతోపాటు ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వేట మెుదలెట్టారు. అయితే ఇవే ఎన్నికల్లో తమ వారసులను రాజకీయాల్లోకి పరిచయం చెయ్యాలని కొందరు భావిస్తున్నారు. 

ఇదే కోవలో చేరిపోయారు మాజీమంత్రి శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని చెప్పారు. 

అయితే శ్రీకాళహస్తి టికెట్ ను తన కుమారుడు సుధీర్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. అయితే తనయుడు కాకుండా మీరే చెయ్యాలంటూ బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బొజ్జల పోటీ చేస్తేనే బాగుంటుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారట. 

ఇకపోతే గతంలో మంత్రిగా పనిచేసిన సందర్భంలో అనారోగ్యం కారణంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించారు చంద్రబాబు. అదే అనారోగ్యం కారణంగా ఎన్నికల్లో పోటీ చెయ్యనని మాజీమంత్రి చంద్రబాబుకు విన్నవించుకున్నారు. 

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యరన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీడీపీలో ఆశావాహులు భారీ సంఖ్యలో ఉన్నారు. 

ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఎస్.సీవీ నాయుడు బొజ్జలకు టికెట్ ఇవ్వకుంటే తనకే టికెట్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు టికెట్ ఎవరికి ఇస్తారో అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.  

click me!