ఉత్కంఠకు తెర... వైసిపి తీర్థం పుచ్చుకున్న గోకరాజు కుటుంబం

By Arun Kumar PFirst Published Dec 9, 2019, 6:09 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నాయకుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులతో కలిసి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.  

అమరావతి: ఏపిలో బలోపేతం కోసం ఇతర పార్టీల నుండి భారీ చేరికలను ఆహ్వానిస్తున్న బిజెపి కి  పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి  చెందిన కీలక నాయకులు, నరసాపురం మాజీ ఎంపీ  గోకరాజు గంగరాజు వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గోకరాజు కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. గంగరాజు సోదరుడు నరసింహ రాజు, రామరాజులతో పాటు ఆయన తనయుడు రంగరాజు లకు కూడా వైసిపి కండువా కప్పిన జగన్ పార్టీలో చేర్చుకున్నారు. 

read more జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం... వారికోసం ప్రత్యేకంగా ప్రభుత్వ శాఖ

గత రెండు రోజులుగా గంగరాజు వైసిపిలో చేరికపై విభిన్న ప్రచారాలు జరిగాయి. మొదట ఆయన బిజెపిని వీడనున్నట్లు... వైసిపిలో చేరడానికి రంగం  సిద్దం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.  ఆ  తర్వాత ఆయన పార్టీ మారడంలేదని ప్రకటించారంటూ మరో ప్రచారం జరిగింది. దీంతో ఆయన పార్టీ మార్పపై గందరగోళం  ఏర్పడింది.

ఆ గందగోళానికి తెరదించుతూ చివరకు బిజెపిని వీడేందుకే గంగరాజు సిద్దమయ్యారు. ఇలా స్వయంగా జగన్ సమక్షంలో వైసిప  కండువా కప్పుకుని కుటుంబ సభ్యులతో కలిసి అధికారికంగా వైసీపిలో చేరిపోయారు. 

read more బిజెపికి షాక్... వైసిపిలోకి గోకరాజు, ముహూర్తం ఖరారు

2019 ఎన్నికల్లో గోకరాజు రంగరాజు వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణమరాజుపై పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి గెలిచిన రఘురాజ కృష్ణమరాజు బిజెపి దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోకరాజు గంగరాజు వైసీపిలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 


 

click me!