సంచలనం: చంద్రబాబు వైఫల్యాలపై బిజెపి వీడియో

First Published Feb 26, 2018, 10:42 AM IST
Highlights
  • వీడియోలోకానీ, పుస్తకంలో కానీ ప్రధానంగా మూడు అంశాలను ఉండబోతున్నాయి.

మిత్రపక్షాల మధ్య అగాధం రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న అగాధం చివరరకు పొత్తులు విచ్ఛినమైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్న స్ధాయిలో ఉంది. త్వరలో చంద్రబాబుపై బిజెపి పెద్ద బాంబే వేయాలని రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపధ్యంలో రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన సంగతి అందరకీ తెలిసిందే. అభివృద్ధి వేదికగా రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.

ప్రస్తుత విషయానికి వస్తే గడచిన మూడున్నరేళ్ళ చంద్రబాబు పాలనపై బిజెపి ఓ వీడియో డాక్యుమెంటరీ తీస్తోంది. మూడున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు పాలనలోని వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్ళటానికి వీలుగా 30 నిముషాల వీడియో రెడీ అవుతోంది. వీడియోతో పాటు బుక్ లెట్ కూడా సిద్ధమవుతోంది. మరో నాలుగు రోజుల్లో వీడియో, పుస్తకం రెండూ రెడీ అవుతాయి.

వీడియోలోకానీ, పుస్తకంలో కానీ ప్రధానంగా మూడు అంశాలను ఉండబోతున్నాయి. ఒకటి: చంద్రబాబు పాలనలో చోటు చేసుకున్న అవినీతి. రెండు: రాయలసీమ సమస్య పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం. మూడోది: పోయిన ఎన్నికల్లో చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలెన్ని? నెరవేర్చినవెన్ని? అన్న అంశాలు ప్రధానంగా ఉంటాయి.

బిజెపి జాతీయ నాయకత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో నేతలు వీడియో, పుస్తకాన్ని రెడీ చేస్తున్నారు. బిజెపిలోని ఓ కీలక నేత ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ, తమ పార్టీ ఇచ్చిన 100 హామీల్లో 90 నెరవేర్చిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 10 మాత్రం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీల్లో కేవలం 10 మాత్రమే నెరవేర్చిన చంద్రబాబు, 90 హామలను నెరవేర్చిన బిజెపిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడ్డారు.

చంద్రబాబు పాలనపై రెడీ అవుతున్న వీడియో, పుస్తకంలో ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, కందుల రాజమోహన్ రెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. పరిస్దితులన్నీఅనుకూలిస్తే బహుశా వారంలోగానే వీడియో, పుస్తకాన్ని విడుదల చేయటానికి బిజెపి ఏర్పాట్లు చేస్తోంది.

 

 

click me!