చంద్రబాబు ప్రయత్నాలు వృథా, జగన్ కు ప్రత్యామ్నాయం మేమే : బీజేపీ నేత రామ్ మాధవ్

By Nagaraju penumalaFirst Published Oct 30, 2019, 2:38 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను ఆపేందుకే బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం ఉండబోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. 

గుంటూరు: రాబోయే రోజుల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండబోతున్నాయని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న నావలాంటిదని ఆరోపించారు. 

విజయవాడ సింగ్ నగర్ లో బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన రామ్ మాధవ్ తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను ఆపేందుకే బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం ఉండబోదని స్పష్టం చేశారు. అంతేగాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదిగేందుకు కృషి చేస్తామని రామ్ మాధవ్ తెలిపారు. 

వైయస్ఆర్ ప్రభుత్వ పథకాలు కేవలం అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కూడా ఇలానే వ్యవహరించిందని చెప్పుకొచ్చారు.  

గతంలో తెలుగుదేశం పార్టీ మాదిరిగానే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర పధకాలను తమ పధకాలుగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని తెలిపారు.  

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక వైసీపీ కార్యకర్తలకు కమిటీల ద్వారా చేయటం ఏమాత్రం సరికాదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. అందువల్లే పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు.   

ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీ చరిత్ర వక్రీకరిస్తోంది, రామ్ మాధవ్ ది వికారమైన స్టేట్మెంట్: విమోచన దినోత్సవ వేడుకల్లో ఉత్తమ్

వైసీపీ వల్ల మేలు కంటే కీడే ఎక్కువ : బీజేపీ నేత రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు

click me!