మల్టీపుల్ టర్న్స్: టీడీపీని ఏకేసీన జీవీఎల్

First Published Jul 24, 2018, 3:31 PM IST
Highlights

ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ  యూటర్నే కాదు, మల్టీపుల్ టర్న్స్‌ తీసుకొందని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని  ప్రత్యేక హోదాను కోరడంలో అర్ధం లేదన్నారు. 

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ  యూటర్నే కాదు, మల్టీపుల్ టర్న్స్‌ తీసుకొందని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని  ప్రత్యేక హోదాను కోరడంలో అర్ధం లేదన్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టం విషయమై  మంగళవారం నాడు రాజ్యసభలో జరిగిన చర్చలో టీడీపీని తీరును బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు  తూర్పారబట్టారు.  ఈ చర్చ సందర్భంగా  కేంద్రం నుండి  ఇప్పటి వరకు టీడీపీ తీరును ఆయన ఎండగట్టారు.

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని ప్రత్యేక హోదా అడగడం అనైతికమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల కేవలం 16 వేల కోట్లు వస్తాయని  టీడీపీ నేతలు చెప్పారని ఆయన గుర్తుచేశారు.  ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పనలో అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారని ఆయన చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ రాష్ట్రం ఎందుకు ఒప్పుకొందో చెప్పాలని ఆయన కోరారు. ఏపీకి ఏపీకి కేంద్రం 2,44,471 సాయం చేస్తోందన్నారు. 

గత ఏడాది ప్రత్యేక ప్యాకేజీకి అనుకూలంగా మాట్లాడిన సీఎం చంద్రబాబునాయుుడు, టీడీపీ నేతలు  ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు.  ఈ ఏడాది జనవరిలో ఎందుకు మాట మార్చారో చెప్పాలన్నారు.  యూటర్న్‌ కానే కాదన్నారు. మల్టీపుల్ టర్న్స్ తీసుకొన్నారని  జీవీఎల్ నరసింహరావు  ఆరోపించారు. 

ప్రత్యేక ప్యాకేజీకి అనుకూలంగా మహానాడులో  చేసిన తీర్మానాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ, ఈనాడు ప్రత్యేక ప్యాకేజీని టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జీవీఎల్ నరసింహరావు ప్రసంగానికి టీడీపీ ఎంపీలు  సుజనాచౌదరి, సీఎం రమేష్ అడ్డు తగిలారు.  అయితే  వెంకయ్యనాయుడు మాత్రం  ప్రసంగానికి అడ్డు తగలకూడదని వారికి పదే సూచించారు.


 

click me!