లేనివి ఉన్నట్లుగా చూపించి ప్రజాధనాన్ని దోచుకున్నారు: రాజ్యసభలో టీడీపీపై జీవీఎల్ ఫైర్

Published : Jul 15, 2019, 05:21 PM IST
లేనివి ఉన్నట్లుగా చూపించి ప్రజాధనాన్ని దోచుకున్నారు: రాజ్యసభలో టీడీపీపై జీవీఎల్ ఫైర్

సారాంశం

తెలుగుదేశం పార్టీ భారీగా ప్రజాధనాన్ని దోచుకుందని విరుచుకుపడ్డారు. లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపి నష్టపరిహారం దండుకున్నారంటూ విరుచుకుపడ్డారు. చెట్లు, ట్యూబువెల్స్‌ పేరుతో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భారీగా డబ్బు దోచుకున్నారని రాజ్యసభలో స్పష్టం చేశారు. 

న్యూఢిల్లీ : ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.  పోలవరం ప్రాజెక్టు విషయంలో సహాయ పునరావాస ప్యాకేజీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందవని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ భారీగా ప్రజాధనాన్ని దోచుకుందని విరుచుకుపడ్డారు. లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపి నష్టపరిహారం దండుకున్నారంటూ విరుచుకుపడ్డారు. చెట్లు, ట్యూబువెల్స్‌ పేరుతో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భారీగా డబ్బు దోచుకున్నారని రాజ్యసభలో స్పష్టం చేశారు. 

పోలవరం ప్రాజెక్టును ఆసరాగా చేసుకుని టీడీపీ చేసిన అక్రమాలపై విచారణ జరపాలని ప్రధాని నరేంద్రమోదీని కోరతానని స్పష్టం చేశారు. త్వరలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మోదీని కలిసి కోరనున్నట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu