సర్పంచ్ భర్త ఆత్మహత్య: సర్కార్ సీరియస్, విచారణకు సిట్

By Siva KodatiFirst Published Feb 3, 2021, 3:18 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా గొల్లలకుంట టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగంగా దర్యాప్తు నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేసింది

తూర్పుగోదావరి జిల్లా గొల్లలకుంట టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగంగా దర్యాప్తు నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ బృందంలో ఒక డీఎస్పీతో పాటు మరో నలుగురు సభ్యులు వున్నారు. ఇప్పటికే సిట్ టీమ్ దర్యాప్తును ప్రారంభించింది. పోలీసుల నిర్లక్ష్యంతో పాటు శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్ ఆత్మహత్యపై విచారణ జరిపి సిట్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

Also Read:గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త అనుమానాస్పదమృతి: ఆరా తీసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

గత ఆదివారం శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడుు. అయితే ఆత్మహత్యకు ముందు రోజు వైసీపీ నేతలు శ్రీనివాస్ రెడ్డిని కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేశారు.

కొందరు మత్తు మందు ఇచ్చి కాళ్లు , చేతుల కట్టేసి దూరంగా పడేశారు. ఈ ఘటనపై మర్నాడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన శ్రీనివాస్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా పోలంలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. 

click me!