24 గంటల్లో చిత్తూరులో అధికం, విజయనగరంలో అత్యల్పం: ఏపీలో మొత్తం కరోనా కేసులు 8,80,430 చేరిక

Published : Dec 25, 2020, 05:43 PM IST
24 గంటల్లో చిత్తూరులో అధికం, విజయనగరంలో అత్యల్పం: ఏపీలో మొత్తం కరోనా కేసులు 8,80,430 చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 355 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 80 వేల 430 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 355 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 80 వేల 430 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు.  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనాతొ ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,091కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,15,31,206 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 56,409 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0355  మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 69 వేల 478 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 3,861 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో 015,చిత్తూరులో 081,తూర్పుగోదావరిలో 049, గుంటూరులో 053, కడపలో 012, కృష్ణాలో 043, కర్నూల్ లో 005, నెల్లూరులో 024, ప్రకాశంలో 012, శ్రీకాకుళంలో 012, విశాఖపట్టణంలో 028, విజయనగరంలో 006,పశ్చిమగోదావరిలో 008 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,238, మరణాలు 596
చిత్తూరు  -85,792,మరణాలు 839
తూర్పుగోదావరి -1,23,503, మరణాలు 636
గుంటూరు  -74,476, మరణాలు 663
కడప  -54,883, మరణాలు 458
కృష్ణా  -47,463,మరణాలు 663
కర్నూల్  -60,529, మరణాలు 487
నెల్లూరు -62,027, మరణాలు 505
ప్రకాశం -61,982, మరణాలు 578
శ్రీకాకుళం -45,901, మరణాలు 346
విశాఖపట్టణం  -59,008, మరణాలు 549
విజయనగరం  -41,004, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,729, మరణాలు 533

 

 

PREV
click me!

Recommended Stories

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే
TDP MLA Miriyala Sirisha Devi Emotional Speech About Pawan Kalyan | Adavi Thalli Bata 2.0