విశాఖ నుండి అంతర్వేదికి... బిజెపి ఎమ్మెల్సీ అరెస్ట్ (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 9, 2020, 7:45 PM IST
Highlights

విశాఖ నుంచి అంతర్వేదికి  బయలుదేరిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ బృందాన్ని పాయకరావుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

విశాఖపట్నం: హిందు ధార్మిక సంస్థలపై జరుగుతున్న వరస దాడులను ఖండిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఇందులో పాల్గొనేందుకు విశాఖ నుంచి బయలుదేరిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ బృందాన్ని పాయకరావుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా సరిహద్దుల్లో ఈ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా పోలీసుల చర్యలను మాధవ్ తప్పు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో హిందూ దేవాలయాలు హిందూ ధార్మిక ప్రాంతాలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలం అయిందని మండిపడ్డారు. దేవాలయాలపై ప్రత్యక్షంగా భౌతిక దాడులు చేసి మారణహోమం చేస్తున్నవారికి అండగా ప్రభుత్వం నిలవడం చాలా దారుణం అన్నారు. 

వీడియో

"

గత ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో సుమారు 17 దుర్ఘటనలు హిందూ దేవాలయాలపై జరిగితే నేటికీ ఒక్క దోషిని కూడా అరెస్టు చెయ్యని పరిస్థితి ఉందన్నారు. దీన్ని బట్టే ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక సంస్థలకు, విద్రోహులకు కొమ్ముకాస్తున్నారని అర్థం అవుతుందన్నారు. ఇందుకు గాను పరిణామాలను త్వరలోనే ప్రజల నుంచి  ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఎమ్మెల్సీ మాధవ్.   
 

click me!