చంద్రబాబుపై దేశద్రోహి నేరం కింద కేసు నమోదు చెయ్యాలి: బీజేపీ నేతల డిమాండ్

By Nagaraju penumalaFirst Published Apr 16, 2019, 9:02 PM IST
Highlights

ఈవీఎంలను దొంగిలించిన కేసులో నిందితుడైన హరిప్రసాద్‌ మిడిమిడి జ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతో చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈవీఎంలను మేనిపులేట్‌ చేసే అవకాశం ఉంటే బీజేపీ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3చోట్ల ఎందుకు ఓడిపోతామని ప్రశ్నించారు. 
 
హైదరాబాద్‌: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో చంద్రబాబు పూటకోమాట మాట్లాడుతున్నారని బీజేపీ నేత సుదీష్ రాంబోట్ల విమర్శించారు. 

చంద్రబాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చెయ్యాలని చూస్తున్నారని ఆరోపిస్తూ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2009లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు చేశారని, 2014లో గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయని కితాబిచ్చారని గుర్తు చేశారు. 

ఈవీఎంలను దొంగిలించిన కేసులో నిందితుడైన హరిప్రసాద్‌ మిడిమిడి జ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతో చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈవీఎంలను మేనిపులేట్‌ చేసే అవకాశం ఉంటే బీజేపీ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3చోట్ల ఎందుకు ఓడిపోతామని ప్రశ్నించారు. 

చంద్రబాబు  వ్యవస్థలను తిట్టడం మొదలు పెట్టారని అది చాలా దారుణమని విమర్శించారు. మోదీని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబుపై దేశ ద్రోహి నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దొంగ టెక్నీషియన్‌ హరిప్రసాద్‌ను తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

కర్ణాటకలోని మాండ్యలోని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవహార శైలిపై చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.  

click me!