బాలకృష్ణను దండిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు: చంద్రబాబుపై బీజేపీ నేత ఫైర్

Published : Oct 07, 2019, 03:54 PM IST
బాలకృష్ణను దండిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు: చంద్రబాబుపై బీజేపీ నేత ఫైర్

సారాంశం

ఎమ్మెల్యేలు,ఎంపీలు, పోలీసు అధికారులు ఉన్న ధర్మపోరాట దీక్ష వేదికపై దేశప్రధాని మోదీని పిచ్చికూతలు కూసిన బాలకృష్ణను ఆనాడే దండించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా అని విమర్శించారు. 

అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెహ్రూ యువకేంద్ర సంఘటన వైస్ చైర్మన్, బీజేపీ సీనియర్ నేత విష్ణువర్థన్ రెడ్డి. ఎవరో సోషల్ మీడియాలో ఏవో  అన్నారని తెగ బాధపడుతున్న చంద్రబాబు తన బావ బాలకృష్ణను దండి ఉంచితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. 

ఎమ్మెల్యేలు,ఎంపీలు, పోలీసు అధికారులు ఉన్న ధర్మపోరాట దీక్ష వేదికపై దేశప్రధాని మోదీని పిచ్చికూతలు కూసిన బాలకృష్ణను ఆనాడే దండించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా అని విమర్శించారు. 

ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలని నిలదీశారు. తన తీసుకున్న చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తుంటే తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు విష్ణువర్థన్ రెడ్డి. 
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్